పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyan selvan 2) మూవీ నుంచి 'శివోహం..శివోహం' అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Lyrical Song) చేసింది. ఈ పాట ఆదిశంకరుల విరచితమైన నిర్వాణ శతకంలోనిది కావడం విశేషం.
దర్శకుడు మణిరత్నం(Maniratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ 1 (Ponniyan selvan 1) సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ మూవీకి రెండో పార్టుగా పొన్నియన్ సెల్వన్2 (Ponniyan selvan 2) మూవీ తెరకెక్కుతోంది. భారీ తారాగణం ఇందులో నటిస్తోంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ వారు రూపొందిస్తున్నారు.
‘పొన్నియన్ సెల్వన్ 2’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్:
పొన్నియన్ సెల్వన్(Ponniyan selvan ) మూవీకి ఏఆర్ రెహ్మాన్(AR Rahaman) మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్టు తీసే సమయంలో దాదాపు సెకండ్ పార్టుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో దాదాపు సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యి విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 28వ తేదిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్(Release) చేయనున్నారు.
సినిమా విడుదల తేది దగ్గరపడటంతో ప్రమోషన్స్ ను పెంచారు. సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. తాజాగా పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyan selvan 2) మూవీ నుంచి ‘శివోహం..శివోహం’ అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Lyrical Song) చేసింది. ఈ పాట ఆదిశంకరుల విరచితమైన నిర్వాణ శతకంలోనిది కావడం విశేషం. కొంతమంది సాధువుల మధ్య ఈ పాట సాగుతున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.