Renu Desai : నేనేం తప్పు చేశా.. రేణు దేశాయ్ షాకింగ్ ట్వీట్..!
Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ని పవన్ ఫ్యాన్స్ వదిలిపెట్టడం లేదు. ప్రతి విషయంలోనూ ఆమెను ఏదో ఒక విధంగా ఇబ్బందిపెడుతూనే ఉంటారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిందో లేదో...ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ని పవన్ ఫ్యాన్స్ వదిలిపెట్టడం లేదు. ప్రతి విషయంలోనూ ఆమెను ఏదో ఒక విధంగా ఇబ్బందిపెడుతూనే ఉంటారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిందో లేదో…ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. మరికొందరు అయితే దారుణంగా ఆమెను ట్రోల్ చేశారు. దీంతో రేణు తన రెండో పెళ్లి నిర్ణయాన్ని వదిలేసింది. ఇక అక్కడితో ఆగలేదు.. ఇప్పుడు పవన్ కొడుకు అకీరా మీద ఫ్యాన్స్ రెచ్చిపోతుంటే తట్టుకోలేని రేణు గొంతు విప్పింది. 11 ఏళ్లుగా ఈ నరకాన్ని అనుభవిస్తున్నా అంటూ ఏకరువు పెట్టింది. ఇదంతా ఎక్కడ మొదలయ్యింది అంటే.. గతవారం అకీరా పుట్టినరోజు. ఆరోజు పవన్ అభిమానుల్లో ఒకరు.. మా అన్న కొడుకును చూపించండి అంటూ డిమాండ్ చేశాడు. అన్న కొడుకు అనగానే చిర్రెత్తుకొచ్చిన రేణు.. మీ అన్న కొడుకు కాదు..? అకీరా నా కొడుకు .. మీ తల్లికి మీరు పుట్టలేదా ..? అంటూ ఫైర్ అయ్యింది.
ఇక ఈ పోస్ట్ తో మొదలైన ఈ గొడవ.. ఇంకా సాగుతూనే ఉంది. రేణుకు సపోర్ట్ చేసేవారు కొంతమంది.. పవన్ పై విరుచుకుపడ్డారు. నీ మాజీ భార్య ఇంత వేదన అనుభవిస్తుంది.. నీ అభిమానుల వలన.. ఒక స్టేట్మెంట్ పాస్ చేసి.. వారి నోళ్లు మూయించొచ్చు గా అని అడిగేస్తున్నారు. ఇలా నిత్యం ఆమె ఎదుర్కుంటున్న ప్రశ్నలను రేణు పోస్ట్ చేస్తూ ఉంది. తాజాగా మరోసారి ఇంకోపోస్ట్ పెట్టి షాక్ ఇచ్చింది. ఇక రేణును ట్రోల్ చేస్తున్న పోస్టులు అవి. ఇలాంటి కామెంట్స్ చదవడం ఎందుకు.. స్పందించడం ఎందుకు..? ఇలా బాధపడడం ఎందుకు.. సెట్టింగ్స్ లోకి వెళ్లి కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేసుకోవచ్చుగా అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇక వీరిపై కూడా రేణు మండిపడింది.
‘‘ఇదే సమాజం.. ఇదే వారితో ప్రాబ్లెమ్. ఎవరికోసమో నేను ఎందుకు మారాలి. మారాల్సిన అవసరం ఏముంది. మీరు చెప్పినట్లు చేయడానికి నేనేం తప్పు చేశాను. అయినా సలహాలు ఇవ్వడం చాల ఈజీ.. బాధపడినవాడికి తెలుస్తుంది నొప్పి’’ అంటూ ఆమె ట్వీట్ చేయగా… అది కాస్త వైరల్ గా మారింది.