SKLM: బాలికల హక్కులను కాపాడేందుకు అనేక చట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీఓ శోభారాణి తెలిపారు. బుధవారం నరసన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈనెల రెండవ తేదీ నుండి 12వ తేదీ వరకు సంకల్పం పేరిట అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు.