MBNR: వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహబూబ్నగర్లో 100 మంది విద్యార్థులకు తాను ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను చదివిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సద్వినియోగంచేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.