MDK : ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. సరిపడా యూరియా లభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక బస్తా యూరియా కోసం దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. పంట పొలాలకు అవసరమైన యూరియా మార్కెట్లో దొరకక అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. బుధవారం ఉదయం పాపన్నపేట మండలంలో యూరియా కోసం రైతులు భారీగా క్యూ కట్టారు.