GDWL: గట్టు మండలం ముచ్చోనిపల్లి గ్రామంలో కొత్త పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్ బుదవారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 20 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. పంచాయతీ కార్యాలయాన్ని నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు.