NZB: జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు కోరారు. చిన్నచిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు వంటి వివాదాలకు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. న్యాయ స్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చని తెలిపారు.