KMM: బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని సీహెచ్ పూజిత చదువుకు ఓ ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభకనబరిచిన పూజిత, ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. బుధవారం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు భాగం రాకేష్ ఆమెకు రూ. 10 వేల ఆర్థిక ప్రోత్సాహం అందజేశారు.