తూ.గో: జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ తెలిపారు. సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం వరకు లక్ష్యంగా ఉన్న 5,59,348 కార్డులలో 4,40,174 కార్డులు పంపిణీ (78.69%) పూర్తి కాగా, ఇంకా 1,19,174 కార్డులు అందజేయాల్సి ఉందని తెలిపారు. త్వరలోనే వీటి పంపిణీ కొనసాగిస్తామని ఆయన అన్నారు.