TPT: ఈ నెల 14, 15 తేదీలలో తిరుపతిలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇవాళ ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. సదస్సు జరగనున్న రాహుల్ కన్వెన్షన్ సెంటర్, అతిథులు బస చేయనున్నహోటల్ గదులను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు.