SRD: కంగ్టి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తుది ఓటరు జాబితాను ప్రదర్శించినట్లు ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 12 ఎంపీటీ, ఒక జడ్పీటీసీ స్థానం ఉందని పేర్కొన్నారు. ఓటర్ జాబితా ప్రతి పంచాయతీలో అందుబాటులో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుభాష్, సిబ్బంది ఉన్నారు.