GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వయానా ఎమ్మెల్యే స్వగ్రామంలోనే రైతులు యూరియా కోసం బారులు తీరారని అన్నారు. ‘అన్నదాత పోరు’ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైసీపీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.