ADB: పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఉట్నూర్ మాజీ ఎంపీపీ పి.జైవంత్ రావు అన్నారు. మంగళవారం ఉట్నూరు మండలంలోని కన్నాపూర్ అనుబంధ ఉమాపతి కుంట గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ నేతలు పాల్గొన్నారు.