BDK: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఈనెల 10న వేలం వేయనున్నట్లు పాల్వంచ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ ఎం. ప్రసాద్ తెలిపారు. ఆటో, ద్విచక్ర వాహనాలు వేలంలో ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 10:30 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ వద్దకు హాజరు కావాలని కోరారు. వేలంలో పాల్గొనేందుకు గుర్తింపు పత్రాలు తీసుకురావాలని సూచించారు.