VSP: అత్తను దారుణంగా హత్య చేసిన వ్యక్తికి సోమవారం విశాఖ మహిళా కోర్టు జీవిత ఖైదు, లక్షా 20 వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానాలో లక్ష రూపాయలు బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని న్యాయమూర్తి వీ. శ్రీనివాసరావు సోమవారం తీర్పునిచ్చారు. 2013లో వీ. మహేష్ తన భార్య, అత్తమామలపై ఇనుప రాడ్తో దాడి చేయగా, అత్త లక్ష్మి మరణించింది.