Rs.9 lakhs లోన్ తీసుకుని రూ.45 లక్షలు కట్టింది.. అయినా తప్పని వేధింపులు
ఆన్ లైన్ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకోవద్దని సైబర్ నిపుణులు/ పోలీసులు పదే పదే చెబుతారు. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన ఓ యువతి రూ.9 లక్షలు తీసుకొని.. ఏకంగా రూ.44 లక్షలు కట్టింది.
Rs.9 lakhs:ఆన్ లైన్ లోన్ యాప్ (loan app) నుంచి లోన్ తీసుకోవద్దని సైబర్ నిపుణులు/ పోలీసులు పదే పదే చెబుతారు. వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తారు. అయినప్పటికీ కొందరు లోన్ తీసుకొని.. ఇబ్బందులు పడతారు. హైదరాబాద్ కూకట్ పల్లికి (kukatpally) చెందిన ఓ యువతి (girl) కూడా అలా ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. రూ.9 లక్షలు (rs.9 lakhs) తీసుకొని.. ఏకంగా రూ.44 లక్షలు (rs.44 lakhs) కట్టింది.
కూకట్ పల్లికి చెందిన ఆ మహిళ కార్పొరేట్ సంస్థలో (corporate office) పనిచేస్తోంది. గత ఏడాది అక్టోబర్ (october) నుంచి లోన్లు తీసుకోవడం ప్రారంభించింది. లైటెనింగ్ రూపీ, బ్యాంక్ నోట్, కత్రా లోన్, ఫైనాన్షియల్ రూపీ యాప్ నుంచి లోన్ తీసుకుంది. రూ.9.43 లక్షల లోన్ తీసుకుంది.
లోన్ తీసుకుంటే తర్వాత రీ పే (repay) చేయాలనే వేధింపులు ఉండనే ఉంటాయి. ఆమె సమయానికి లోన్ కట్టిందో లేదో కానీ.. రూ.44 లక్షల (44 lakhs) మొత్తం కట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ తీసుకున్న అప్పు ముట్టలేదట. లోన్ (loan) కన్నా రూ.35.08 లక్షలు కట్టినా లోన్ తీరలేదని.. ఇంకా నగదు చెల్లించాలని ఆ యాప్ సంస్థలు బెదిరిస్తున్నాయట. లేదంటే సదరు యువతి ఫోటోలను (photos) నగ్నంగా మారుస్తామని వేధింపులకు దిగారు.
ఇక తప్పకపోవడంతో పోలీసులకు (police) ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సో ఇకనైనా ఆన్ లైన్ యాప్ ద్వారా లోన్ తీసుకోకండి.. ఇబ్బందులకు గురికావొద్దని సైబర్ నిపుణులు (cyber experts) మరీ మరీ కోరుతున్నారు.