SKLM: జి.సిగడాం మండలం బూటుపేటలోని ప్రాథమిక పాఠశాలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న కూర్మాన అరుణ కుమారిని ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇవాళ ఎంపీ హెచ్ఎం బోధిస్తున్న తీరును స్వయంగా పరిశీలించి ఆమెను ప్రశంసించారు.