NZB: శ్రీరామ్ సాగర్ జలాశయంలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి 37,840 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆదివారం రాత్రి నీటి విడుదలను ప్రారంభించారు. ఎనిమిది గేట్లు ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091(80.501TMC) అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతోంది.