WGL: ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు గ్రీవెన్స్ ఉంటుందన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెలను సద్వినియోగం చేసుకోవాలని, అన్ని శాఖల అధికారులు నేడు అందుబాటులో ఉంటారని తెలిపారు.