ELR: డబ్బులిస్తామని ఎవరైనా అడిగితే మీ ఆధార్, ఇతర వ్యక్తిగత డాక్యుమెంట్ల కాపీలను షేర్ చేయవద్దని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. ఇలా డాక్యుమెంట్లను షేర్ చేయడంతో వాటితో దొంగ లోన్లు తీసుకోవడం లేదా మీ ఆస్తికి నష్టం కలిగించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.