BDK: మణుగూరు మున్సిపాలిటీ సుందరయ్య నగర్‌కు చెందిన గాండ్ల ఉప్పలయ్య మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మేము సైతం మిత్రమండలి సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఉప్పలయ్య దాన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. సభ్యులు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.