PPM: పాలకోండ మాజీ ఎమ్మెల్యే కళావతిని వీరఘట్టం మండలం వండవలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. వైసీపీ ఆధ్వర్యంలో పాలకొండలో జరగనున్న రైతు పోరు కార్యక్రమానికి వెళ్లనీయకుండా తనను గృహ నిర్బంధం చేశారని ఆమె ఆరోపించారు. ఇటువంటి అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆమె ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.