PDPL: పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. రంగుల పండుగను పురస్కరించుకుని యువకులు, చిన్నారులు వీధుల్లోకి చేరి రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాసులపల్లిలో జరిగిన వేడుకల్లో చిన్నారులు, యువత కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహపరిచారు. మహిళలు, యువతులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పల్లెలన్నీ రంగులమయంగా మారాయి.