»Bollywood Actor Salman Khan Gets Another Threat Call Now Date Also Fixed
Threat Call బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం.. జాగ్రత్త
వార్తల్లో నిలవడానికో.. లేదా పిచ్చో అర్థం కాదు. కానీ కొందరు ప్రముఖులను లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతుంటారు. వీఐపీలు కావడంతో పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తుంటారు.
తన కొత్త సినిమా ‘కిసి క భాయ్ కిసి కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan Movie) ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. గతంలో ఈమెయిల్ (E-mail) బెదిరింపు లేఖ రాగా.. తాజాగా ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ‘ఏప్రిల్ 30వ తేదీన హీరో సల్మాన్ ను చంపేస్తా’ ఒకరు బెదిరింపులకు (Threat Call) పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. కాగా గతంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇంటికి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
వార్తల్లో నిలవడానికో.. లేదా పిచ్చో అర్థం కాదు. కానీ కొందరు ప్రముఖులను లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతుంటారు. వీఐపీలు కావడంతో పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తుంటారు. ‘నిన్న (సోమవారం) పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక ఫోన్ వచ్చింది. ఓ వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. రాజస్థాన్ (Rajasthan) లోని జోధ్ పూర్ (Jodhpur)కు చెందిన రాకీ భాయ్ (Rocky Bhai)గా తెలిపాడు. ఏప్రిల్ 30న సల్మాన్ ఖాన్ చంపేస్తా’ అని బెదిరించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. గత నెలలో సల్మాన్ ఖాన్ కు ఈ మెయిల్ లో బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. దానిపై ముంబైలోని బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మెయిల్ పంపిన గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ ను అరెస్ట్ చేశారు. వరుసగా ఈ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. నిస్సాన్ పాట్రన్ ఎస్ యూవీ బుల్లెట్ ప్రూఫ్ కారును సల్మాన్ కొనుగోలు చేశాడు. దాని విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుంది.
వరుస పరాజయాల అనంతరం ‘కిసి క భాయ్ కిసి కి జాన్’పై సల్మాన్ ఆశలు పెంచుకుని ఉన్నాడు. పూజా హెగ్డే (Pooja Hegde), భూమిక, విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh)తో కలిసి సల్మాన్ ఫర్హాద్ సంజి (Farhad Samji) దర్శకత్వంలో సినిమా చేశాడు. ఈ సినిమాలో తెలంగాణ సాంస్కృతిక సంబురం బతుకమ్మ పాటను చిత్రీకరించడం విశేషంగా ఉంది. తన సొంత బ్యానర్ లో నిర్మించిన సల్లూ భాయ్ ఈ సినిమా కోసం తెగ కష్టపడ్డాడు. ఏప్రిల్ 21 రంజాన్ సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో సల్మాన్ బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతున్నది.