BDK: శ్రీరామచంద్రుని కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు కోటి తలంబ్రాలను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. హోలీ సందర్భంగా పినపాక మండలం ఈ. బయ్యారం సాయిబాబా ఆలయం నుంచి మంగళవారం రాత్రి భద్రాచలం వరకు భక్తులు పాదయాత్ర ప్రారంభించారు. ఎనిమిదేళ్లుగా నిరంతరంగా కోటి తలంబ్రాలను సమర్పించడం తమ ఆచారంగా కొనసాగుతోందని వారు తెలిపారు.