KDP: మైదుకూరు జాతీయ రహదారిపై ఆదివారం ద్విచక్ర వాహనంను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే మృతుడు కలస పాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాపాయ నుండి బయటపడవచ్చు అని పోలీసులు తెలిపారు.