»Worlds Most Expensive Number Plate Recorded In Guinness World Record You Will Be Shocked To Hear Price
Number Plate : ప్రపంచంలో కాస్లీ నంబర్ ప్లేట్.. ధర రూ.123కోట్లు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఓ చారిటీ కోసం నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించింది. ఆ వేలంలో పీ-7 అనే ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌ల రికార్డుకు (దాదాపు రూ. 122.6 కోట్లు) అమ్ముడుపోయింది. ఈ భారీ ధర ట్యాగ్‌తో ఈ నంబర్ ప్లేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్(guinness world record)ను సృష్టించింది.
Number Plate : ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల(Number Plate) పై వాహనదారుల్లో క్రేజ్ భారీగా పెరిగింది. అన్నింటికంటే భిన్నంగా తమ వాహన నంబర్ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వాహనాలకు ఉపయోగించే సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్లతో పోల్చితే ఫ్యాన్సీ నెంబర్లు అధిక ధర పలుకుతుంటాయి. కొన్ని ఫ్యాన్సీ నెంబర్ల(fancy number)ను వేలం కూడా వేస్తారు. భారత్ లో ఇలాంటి వేలం పాటల్లో సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు పాల్గొని రూ.లక్షలు చెల్లించి తమ నెంబర్లను దక్కించుకుంటారు. అయితే వీఐపీ నంబర్ ప్లేట్లపై వచ్చిన వార్తలు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఓ చారిటీ కోసం నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించింది. ఆ వేలంలో పీ-7 అనే ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌ల రికార్డుకు (దాదాపు రూ. 122.6 కోట్లు) అమ్ముడుపోయింది.
ఈ భారీ ధర ట్యాగ్‌తో ఈ నంబర్ ప్లేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్(guinness world record)ను సృష్టించింది. ఈ నంబర్ ప్లేట్ ని సొంతం చేసుకున్నా వారి పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ వేలంలో వచ్చిన సొమ్మును దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్(Sheikh Mohammed bin Rashid) కు చెందిన ప్రపంచ భోజన పథకం (100 కోట్ల భోజనాల వితరణ) కోసం ఖర్చు చేస్తారు. కుబేరులు అనదగ్గ అరబ్ సంపన్నులు ఉపయోగించిన వాహనాల నెంబర్ ప్లేట్లను వేలం వేయడం యూఏఈలో ఆనవాయతీ. ఈ వేలం ఎమిరేట్స్ ఆక్షన్స్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నిర్వహించారు ఇంకా గ్లోబల్ ఇనిషియేటివ్స్ సహకారంతో జరిగింది. 2008లో 1 అనే ఒకే ఒక నెంబరు ఉన్న ప్లేట్ ను వేలం వేయగా రూ.116 కోట్లకు అమ్ముడుపోయింది. స్థానిక వ్యాపారి సయీద్ అబ్దుల్ గఫార్ ఖౌరి దీన్ని కొనుగోలు చేశాడు. ఇప్పుడా రికార్డు పీ-7 నెంబర్ ప్లేట్ వేలంతో తెరమరుగైంది.