కడప: జిల్లాలో భూ రికార్డుల స్వచ్చీకరణ, రీసర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలను పూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే, భూ సమస్యలపై వచ్చే PGRS, రెవెన్యూ క్లినిక్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.