CTR: శ్రీరంగారాజపురం మండలంలో అగ్ని ప్రమాదంలో చెరుకు తోట, గానుగ షెడ్, బెల్లం దగ్ధమైన ఘటనపై నేడు రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత రైతు నవీన్‌ను కలిసి ఘటన ఎలా జరిగిందో ఆరా తీశారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతుకు న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే వేసవికాలంలో అగ్ని ప్రమాదాల నివారణకై రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.