NZB: సిరికొండ మండలం పెద్ద వాల్గేట్ వరద బాధితులకు కుర్దుల్పేట్ గ్రామస్థులు అండగా నిలిచారు. వరదల్లో నష్టపోయిన 8 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3, 000 చొప్పున ఆర్థికసాయం అందించారు. దుస్తులు, ఆహారం కూడా లేని తమకు కుర్దుల్పేట్ గ్రామస్థులు చేసిన సాయం ఎంతో గొప్పదని బాధితులు కొనియాడారు.