NLG: భావితరాల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఉందని చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ నీలకంఠం నరేష్ అన్నారు. పాఠశాలలో సోషల్ సబ్జెక్టు బోధిస్తున్న దొడ్డి కైలాసం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులతో కలిసి ఆయన శనివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు పాల్గొన్నారు.