ADB: భీంపూర్ మండలంలోని ధన్నోరా గ్రామానికి చెందిన మంత్రి మహేందర్‌కి ఇటీవలే క్యాన్సర్ ఆపరేషన్ కాగా కీమో చికిత్స కోసం హైదరాబాద్‌కి వెళ్తున్న విషయం తెలుసుకొని 2000-2001 పదవ తరగతి బ్యాచ్ అందరూ పోగు చేసి శనివారం మహేందర్ ఇంటికి వెళ్లి రూ.26 వేలు అందించి బాసటగా నిలిచారు. అందజేసిన వారిలో మార్చెట్టి అనిల్,రవీందర్,జయ సారథి,షేక్ మహమ్మద్ రఫీ,అశోక్‌లు ఉన్నారు.