జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులపై శంకులపల్లికి చెందిన బీరం రాజేష్ అతిగా మద్యం తాగి వచ్చి దురుసుగా ప్రవర్తిస్తూ విధులకు ఆటంకం కలిగించాడు. ఈ ఘటనపై జగిత్యాల టౌన్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పీ. కరుణాకర్ తెలిపారు.