ADB: తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో గల బ్రిడ్జి (కల్వర్టు) ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ మేరకు బ్రిడ్జిని స్థానిక నాయకులతో కలిసి శనివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. దగ్గరుండి తాత్కాలికంగా మొరం వేయించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని దాని మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు.