మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గణనాథుల నిమజ్జనం ప్రక్రియ పూర్తయింది. పట్టణంలోని పాలకొండ పెద్ద చెరువులో గణనాథులను నిమజ్జనం చేసేందుకు మండపాల నిర్వాహకులు ఇవాళ తెల్లవారుజాము వరకు తీసుకొచ్చారు. నగర పురపాలక అధికారులు, పోలీసు సిబ్బంది దగ్గరుండి క్రేన్ సహాయంతో గణనాథులను నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.