KMM: ఖమ్మం రూరల్ గొల్లగూడెం వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం వస్తున్న కారు అతివేగంగా ఉన్నట్లు తెలుస్తుండగా అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. కారు డోర్లు లాక్ అయి ఉండగా అందులోని వ్యక్తి బయటపడే అవకాశం లేకపోయిందని తెలుస్తోంది. కారును బయటకు తీసి అద్దాలు పగులగొట్టే లోగా డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తి మృతి చెందాడు.