ప్రకాశం: పీసీపల్లిలో విద్యుత్ షాక్తో యువకుడు గాయపడ్డాడు. వరిమడుగు విద్యుత్ ఫీడర్ పరిధిలోని మారెళ్ల చెరువు సమీపంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద హెడ్ ఫ్యూజు పోవడంతో లైన్మెన్ సిలోమాన్కు సమాచారం అందింది. జంగాలపల్లికి చెందిన కొండారెడ్డి అనే ప్రైవేట్ వర్కర్ ఫ్యూజు వేయడానికి వెళ్లగా, సాంకేతిక లోపం వల్ల విద్యుత్ షాక్కు గురైనట్లు సమొచారం.