MDK: ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకొని పాపన్నపేట మండలం ఏడుపాయలలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకే రాజగోపురంలో అమ్మవారి దర్శనం ఉంటుందని ఆలయ ఈవో శుక్రవారం తెలిపారు. తిరిగి మరుసటి రోజు సోమవారం ఉదయం గంటలు 5:30కు ఆలయం తెరచి సంప్రోక్షణ అభిషేకం అనంతరం రాజగోపురం వద్ద భక్తులకు వన దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.