కోనసీమ: అల్లవరం మండలం కొమరిగిరిపట్నంలో గురువారం రాత్రి జరిగిన వినాయక చవితి ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక యువకుడు ఇద్దరిని కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన ఆ ఇద్దరు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.