Akira Nandan : ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని యంగ్ హీరో అఖిల్.. తమ తమ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కూడా.. తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని యంగ్ హీరో అఖిల్.. తమ తమ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ కూడా.. తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అల్లు వారి ఫ్యాన్స్ అల్లు అర్జున్, అక్కినేని అభిమానులు అఖిల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుంటే.. మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం అకిరానందన్కి బర్త్ డే విషెస్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఏడాదితో టీనేజ్ కంప్లీట్ చేసుకున్నాడు అకిరా నందన్. ఈ నేపథ్యంలో అకిరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నాడనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లాంటి వాటిలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అకిరానందన్. హైట్, పర్సనాలిటీ విషయంలో తండ్రికి తగ్గ తనయుడిగా.. అదిరిపోయే కటౌట్ అకిరా నందన్ సొంతం. అందుకే అకిరా నందన్ కొత్త ఫోటోలు బయటికొచ్చినప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫాన్స్. అయితే ప్రస్తుతం పవన్ వరుస సినిమాలు కమిట్ అయ్యారు. ఇవి అయిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితమవ్వాలనే ఆలోచనలో ఉన్నారు పవర్ స్టార్. అందుకే ఆయన వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తండ్రి లెగసీని కంటిన్యూ చేయాలని అంటున్నారు అభిమానులు. ఆ మధ్యన కూడా అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలొచ్చాయి. కానీ రేణు దేశాయ్ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేసింది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అకిరా.. హీరో అవాల్సిందనేనని గట్టిగా కోరుకుంటున్నారు. మరి అకిరా ఎంట్రి ఎప్పుడుంటుందో చూడాలి.