అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘కుటుంబ పాలన’ మరోసారి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. వాటి వలనే అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి పెరిగిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠినంగా వ్యవహరిస్తానని సంచలన ప్రకటన చేశారు.
గుప్పెడు మంది అభివృద్ధికి అడ్డంకిగా మారారు. పని చేస్తున్న వాళ్లతో కొంతమంది ఇబ్బందులు కొందరు వారి స్వలాభం కోసం పని చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల నేను కఠినంగా వ్యవహరిస్తా.
‘వ్యవస్థపై కుటుంబవాద శక్తులు తమ నియంత్రణ అధికంగా మారింది. పేదలకు పంపిన డబ్బులు వీళ్లు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందా లేదా? అని ప్రశ్నించారు.
సహకరించాలి
‘రైల్వేల్లో తెలంగాణకు భారీగా నిధులు కేటాయించాం. హైవే నెట్ వర్క్ ను విస్తరిస్తున్నాం. కొందరు వారి స్వలాభం మాత్రమే చూసుకుంటున్నారు. తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి పెరిగింది. కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోంది. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘాతం కలిగించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. తెలంగాణలో కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి. కొంత మంది అవినీతిపరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ వారికి కోర్టు షాక్ ఇచ్చింది. ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే. అవినీతిని ముక్తకంఠంతో ఖండించాల్సిందే’ అంటూ ప్రధాని సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు