ఇచ్చిన హామీలు (Promises) నెరవేర్చకపోవడం, అభివృద్ధికి (Development) సహకరించకపోవడం వంటి వాటితో ప్రధాని మోదీపై (Narendra Modi) తెలంగాణ (Telangana) వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఎప్పుడూ తెలంగాణలో పర్యటించాల్సి వచ్చినా ప్రధానికి పరాభవం తప్పడం లేదు. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. తాజాగా శనివారం పర్యటన కూడా ఇదే విధంగా సాగుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరి దూరంగా ఉంటోంది. కేవలం ప్రొటోకాల్ (Protocol) పరంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. మోదీ పర్యటనకు యథావిధిగా సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao) దూరంగా ఉంటున్నా. అయితే ఇది అధికారిక కార్యక్రమం (Official Visit) కావడంతో ప్రధాని పక్కన సీఎం కేసీఆర్ కు కుర్చీ వేశారు.
సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వందే భారత్ రైల్ (Vande Bharat Express) ప్రారంభం కార్యక్రమానికి ప్రదాని హైదరాబాద్ (Hyderabad)లో పర్యటిస్తున్నారు. అనంతరం పరేడ్ మైదానంలో (Parade Ground) నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే ఇది అధికారిక కార్యక్రమం కావడంతో ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కూడా కుర్చీ వేశారు. అది కూడా ప్రధాని పక్కనే వేశారు. ఇక మల్కాజిగిరి (Malkajgiri) ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డికి (Revanth Reddy) వేదికపై కుర్చీ వేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు కావడంతో ప్రొటోకాల్ ప్రకారం వారికి స్థానాలు కల్పించారు.
దేశవ్యాప్తంగా మోదీ పాలనను వ్యతిరేకిస్తున్న వారిలో కేసీఆర్ ఒకరు. భారత్ రాష్ట్ర సమితి (BRS Party) ప్రారంభం అనంతరం తీవ్రస్థాయిలో మోదీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నారు. రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనకు గతంలో మాదిరి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి స్థానిక ఎంపీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మోదీ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.