తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ వినాయక క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం (Kanipakam Varasiddhi Vinayaka Swamy Temple). చిత్తూరు జిల్లాలో (Chittoor District) కొలువైన ఈ ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయ ఉద్యోగులే (Employees) చేతివాటం ప్రదర్శించారు. భక్తులకు అన్నదానం చేసే విభాగంలో దొంగతనానికి పాల్పడ్డారు. నిత్యాన్నదాన సత్రంలో వరుసగా వస్తువులు మాయం కావడంతో అనుమానమొచ్చిన అధికారులు (Endowment Officers) తనిఖీలు చేయగా వారి దొంగతనం బయటపడింది.
చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో నిత్యాన్నదానం సత్రం (Nithya Annadanam) ఉంది. నిత్యం ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు (Piligrims) అన్నదానం చేస్తుంటారు. అయితే ఆ విభాగంలో తరచూ వస్తువులు (Items) మాయమవుతున్నాయి. వస్తువులు, ఆహార పదార్థాలు కనిపించడం లేదు. అనుమానం వచ్చిన అధికారులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బందే దొంగతనానికి (Theft) పాల్పడుతున్నారని గుర్తించారు. వెంటనే ఆలయంలో పని చేసే సిబ్బంది, ఉద్యోగుల ఇళ్లల్లో దాడులు చేశారు. నిత్యావసర వస్తువులను ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు చేయగా ఇద్దరు ప్రధాన వంట మనుషులు (Chefs), వారి సహాయకులు (Helpers) దొంగతనాలు చేస్తున్నారు. తనిఖీలో సమయంలో వారి ఇళ్లల్లో ఆలయ నిత్యాన్నదాన వస్తువులు పట్టుబడ్డాయి. సుమారు 25 బస్తాల బియ్యం (Rice), రెండు బస్తాల కందిపప్పును (Dal) స్వాధీనం చేసుకున్నారు. ఇక మిగతా ఆలయ సిబ్బంది ఇళ్లల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.