కోనసీమ: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా నియమించారు. తాడేపల్లి నుంచి దీనిపై మంగళవారం ఆదేశాలు వచ్చాయి. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టామని ఆదేశాల్లో పేర్కొన్నారు. గొల్లపల్లి ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని డాక్టర్ల సలహా మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.