»Bjp Will Work Country Buildup Eradication Of Povertykiran Kumar Reddy
Country buildup కోసం బీజేపీ కృషి.. పేదరిక నిర్మూలన కూడా: కిరణ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తమ కుటుంబం గత 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు.
Bjp will work Country buildup, Eradication of poverty:Kiran Kumar reddy
Kiran Kumar reddy:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar reddy) కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తమ కుటుంబం గత 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. బీజేపీ విధానాలు, ప్రజలకు అందిస్తోన్న సేవకు ఆకర్షితుడినై పార్టీలో చేరానని వివరించారు.
దేశ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు బీజేపీ కృషి చేస్తోందని కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar reddy) తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (prahlad joshi) సమక్షంలో కమలం గూటికి చేరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ (modi), హోంమంత్రి అమిత్‌షా (amith shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) సహా పార్టీ కార్యకర్తల కృషి వల్ల బీజేపీ బలమైన శక్తిగా తయారైందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదన్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుడు నిర్ణయంతో పార్టీ అధికారం కోల్పోయిందని కిరణ్ కుమార్ (Kiran Kumar reddy) చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పార్టీ నాయకత్వం చెల్లాచెదురైందని వివరించారు. ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియని అయోమయం ఏర్పడిందన్నారు. సరిగ్గా ఆ సమయంలో బీజేపీ (bjp) ఎదిగేకొద్దీ కాంగ్రెస్ దిగజారుతూ వచ్చిందని తెలిపారు.
పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకుని నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో ఆ పార్టీ విఫలమైందన్నారు. దేశ నిర్మాణం పట్ల బీజేపీ (bjp) నాయకత్వం స్పష్టమైన అవగాహనతో ఉందన్నారు. శక్తిమంతమైన నాయకులే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పేదలకు సేవ చేయడమే జాతి నిర్మాణమనే సంకల్పం బీజేపీకి ఉందన్నారు. దేశం కోసం మోడీ (modi), అమిత్‌షా (amith shah) కంకణబద్ధులై ఉన్నారని కిరణ్‌కుమార్ (Kiran Kumar reddy) పేర్కొన్నారు.
ప్రధాని మోడీ (modi) నేతృత్వంలో సాగుతోన్న పోరాటంలో కిరణ్ కుమార్ (Kiran Kumar reddy) కూడా ఉంటారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (prahlad joshi) అన్నారు. కిరణ్ కుమార్ (Kiran Kumar reddy) ప్రభావం ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని చెప్పారు. కిరణ్ (kiran) కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగందని.. క్రికెట్ నేపథ్యం ఉన్న కిరణ్ ఇక బీజేపీ తరఫున ఆడతారని జోషి (joshi) తెలిపారు. ఏపీలో సూపర్ బ్యాటింగ్ చేస్తారని తెలిపారు.