Prabhas ‘హనుమాన్’ పై హైప్ పెంచుతున్న ‘ఆదిపురుష్’!
Prabhas : రామయాణం బేస్ చేసుకొని ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ కాగా.. ఇంకోటి యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ సినిమా. అందుకే ఆదిపురుష్ వల్ల.. హనుమాన్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
రామయాణం బేస్ చేసుకొని ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ కాగా.. ఇంకోటి యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ సినిమా. అందుకే ఆదిపురుష్ వల్ల.. హనుమాన్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే.. ఆదిపురుష్ టీజర్ చూసిన తర్వాత.. ఈ సినిమాకు ఇంత బడ్జెట్ పెడుతున్నారా.. ఇదో యానిమేటేడ్ మూవీ అని డైరెక్టర్ ఓం రౌత్ పై మండిపడ్డారు నెటిజన్స్. కానీ హనుమాన్ టీజర్ చూసిన తర్వాత.. గ్రాఫిక్స్ అదిరిపోయాయనే కాంప్లిమెంట్స్ అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇలా ఈ రెండు సినిమాలను బడ్జెట్‌తో సబంధం లేకుండా పోలుస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో హనుమాన్ మూవీ పై అంచనాలు పెరుగుతుండగా.. ఆదిపురుష్ పై నెగెటివ్ ప్రచారం ఎక్కువైపోతోంది. అసలు ఆదిపురుష్ నెగెటివిటీనే హనుమాన్ సినిమాకు ఎక్కువగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఆ సినిమాతో పోల్చడం వల్లే.. హనుమాన్ను మరింత పబ్లిసిటీ అవుతోంది. రీసెంట్గా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా సాంగ్‌ని రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ హై పిచ్‌లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. దీంతో తేజ సజ్జాతో కలిసి ప్రశాంత్ వర్మ ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్టే కనిపిస్తోంది. కానీ ఆదిపురుష్ మాత్రం ఆ హైప్‌ను అందుకోలేకపోతోంది. శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా బాగా లేదనే కామెంట్స్ మూటగట్టుకుంది. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ బాగున్నా.. ప్రభాస్ క్రేజ్‌కు అది ఏ మాత్రం సరిపోదు. కాబట్టి ఇప్పటికైనా ఓం రౌత్.. ఆదిపురుష్ నుంచి సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఏదేమైనా ఆదిపురుష్ వల్ల.. హనుమాన్ సినిమాకు మాత్రం కలిసొచ్చేలానే ఉందని చెప్పాలి.