ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో రెండో సెషన్ ముగిసింది. టీ విరామ సమయానికి భారత్.. 3 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(26), రిషభ్ పంత్(3) క్రీజులో ఉన్నారు. రెండో సెషన్లో భారత్ కీలక బ్యాటర్లు రాహుల్(46), జైస్వాల్(58), గిల్(12) వికెట్లను కోల్పోయింది.