NRML: సారంగాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను బుధవారం నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారికి పూల మొక్కను అందజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.