WNP: జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ప్రాజెక్టుకు 72,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుందని అధికారులు వెంకటేశ్వర్లు, జుబేర్ అహ్మద్ తెలిపారు. అల్మట్టి ప్రాజెక్ట్‌కు 60 వేల ఔట్‌ఫ్లో కొనసాగుతుందన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాలకు వారం రోజులపాటు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.