NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఈనెల 25న ఉదయం 10 గంటలకి కోవూరు సర్కిల్ కార్యాలయానికి రావాలంటూ SI రంగనాథ్ గౌడ్ నోటీసులు ఇచ్చారు. ఈనెల 8వ తేదీన పోలీస్ స్టేషన్లో ప్రసన్న కుమార్ రెడ్డి పై కేసు నమోదయింది.